rameshbabu
August 16, 2021 SLIDER, TELANGANA
492
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, దళిత సోదరులు ప్రత్యేక బస్సులో తరలి వస్తున్నారు. ఈ బస్సు యాత్రను నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో దళిత సోదరులు హుజూరాబాద్‌కు బయలుదేరారు. మంత్రి మల్లా రెడ్డి …
Read More »
rameshbabu
August 16, 2021 NATIONAL, SLIDER
763
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,31,342 మంది ప్రాణాలను …
Read More »
rameshbabu
August 16, 2021 SLIDER, TELANGANA
501
హుజూరాబాద్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దళిత వాడలు మెరిసిపోతున్నాయి. ఆడపడుచులు మురిసిపోతున్నారు. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో హుజూరాబాద్‌లోని దళిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిని సుందరంగా అలంకరించుకున్నారు. తమ నివాసాల ముందు రంగవల్లులు వేసి.. దళిత బంధు అని చక్కగా రంగులు వేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. అనే పదాలు రాసి.. గులాబీ పార్టీపై తమకున్న అభిమానాన్ని …
Read More »
rameshbabu
August 16, 2021 SLIDER, TELANGANA
562
స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో రైతన్న రుణ విముక్తుడవనున్నాడు. రెండో విడుత పంటరుణాల మాఫీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫాలో బ్యాంకుల్లో రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. మొత్తం 6,06,811 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,006 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ …
Read More »
rameshbabu
August 16, 2021 SLIDER, TELANGANA
602
‘ప్రజాస్వామ్యమంటే సమానత్వమే. వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధి అందుకు సోపానం కావాలి’ అన్న అంబేద్కర్ ఆశయాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా నెరవేరుస్తున్నది. స్వరాష్ట్రంలో దళిత జనోద్ధరణే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. తూతూ మంత్రంగా సాయంచేసి.. ఆర్భాటపు ప్రచారాలు చేసుకొని.. చేతులు దులుపుకోకుండా దళితుల సమస్యను మూలాల నుంచి పెకలించి వేసేందుకు కృషిచేస్తున్నది. ఎస్సీల్లో అన్ని వయసులు, అన్ని …
Read More »
rameshbabu
August 16, 2021 SLIDER, TELANGANA
484
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనపై చేసిన అరాచకాలను గుర్తుచేసుకొని మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పులవేణి పోచమల్లుయాదవ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2018లో ఈటల తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు దయతో బతికి బట్టకట్టానని చెప్పారు. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయితే పునర్జన్మ ఇచ్చింది కెప్టెన్ లక్షీకాంతారావు అని తెలిపారు. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎంపీ లక్ష్మీకాంతారావు సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో …
Read More »
rameshbabu
August 16, 2021 SLIDER, TELANGANA
464
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 20వ శతాబ్దంలో సామాజిక న్యాయం ద్వారా దళితులకు విముక్తి కలిగిస్తే.. 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దళితుల ఆర్థిక …
Read More »
rameshbabu
August 15, 2021 SLIDER, TELANGANA
402
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని.. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, …
Read More »
rameshbabu
August 15, 2021 SLIDER, TELANGANA
378
పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి మహమూద్ …
Read More »
rameshbabu
August 15, 2021 NATIONAL, SLIDER
679
ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …
Read More »