rameshbabu
July 18, 2021 MOVIES, SLIDER
638
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
610
నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు అన్నారు. శనివారం కేసముద్రం లోని తెరాస పార్టీ ఆఫీస్ లో కేసముద్రం మండలానికి చెందిన 08 మంది లబ్ధిదారులకు గాను రూ.2,31,000 /- (రెండు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ) విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కూడా …
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
498
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆయన ఎంపీ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించి తిరిగి వస్తుండగా, ఆరెపల్లి వద్ద ఒక యువకుడు ప్రమాదంలో గాయపడి, రోడ్డు పక్కన పడి ఉండటం గమనించారు. వెంటనే …
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
607
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. శనివారం సాయంత్రం హుజూరాబాద్‌లోని గ్యాస్ గోదాం ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి గతంలో తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించాడు. ఇటీవల ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాది ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొడతానని హెచ్చరించాడు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన టేకుమట్ల …
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
475
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్, మైనారిటీ నాయకులు తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
458
తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటుగా 10 ఎకరాల్లో ఒకేచోట ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి కోసం 5300 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె …
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
405
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నమత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వమే వారి నుంచి చేపలు కొనుగోలుచేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »
rameshbabu
July 18, 2021 HYDERBAAD, SLIDER, TELANGANA
416
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్‌కార్ గోవింద్‌రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »
rameshbabu
July 18, 2021 SLIDER, TELANGANA
538
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »
rameshbabu
July 17, 2021 MOVIES, SLIDER
581
‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.
Read More »