Classic Layout

మెగా హీరోకే షాకిచ్చిన ఉప్పెన బ్యూటీ

కరోనా కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన మూవీతో హీరోయిన్ కృతిశెట్టి కుర్రకారును ఆకట్టుకోన్నది.. ఆ మూవీ విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ మంగళూరు బ్యూటీకి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కార్తీక్ వర్మ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించనుండగా.. ఈ ఆఫర్కు కృతి నో చెప్పినట్లు …

Read More »

భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?

బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.

Read More »

కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.

Read More »

సరికొత్త పాత్రలో రావు రమేష్

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న రావురమేశ్ లుక్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలో రావు రమేశ్ గూని బాజ్జీగా నటిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటో సినీ అభిమానులను అలరిస్తోంది.

Read More »

జింక్ వల్ల అనేక లాభాలు

శరీరానికి జింక్ ఎంతో మేలు చేస్తుంది. జింక్ శరీరంలో తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేసి, వైరస్లో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు 50 మి. గ్రా జింక్ తీసుకోవడం వల్ల కొవిడ్తో పోరాడటానికి సరిపడా రోగనిరోధక శక్తి లభిస్తుందని తేలింది. ఈ ఖనిజ లవణం సహజంగా మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, నట్స్ వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More »

సబ్జా గింజలు వల్ల లాభాలు అనేకం

సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్కు గురి కాదు. టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. జీవక్రియల సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్కు గురి కాదు. టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. జీవక్రియల పనితీరు మెరుగుపడి, …

Read More »

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికం

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా తయారైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉందన్నారు. ఇందుకుగాను 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతున్నాయని, రాష్ట్రంలో 18.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. వారికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటలు సాగుచేయాలని సూచించారు.

Read More »

తమిళ హీరోయిన్ తో రవితేజ

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘క్రాక్’తో హిట్ అందుకున్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటి రాజిషా విజయన్ను హీరోయిన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read More »

సీబీఐ కొత్త చీఫ్ సుబోధ్ జైస్వాల్ గురించి మీకోసం

సీబీఐ కొత్త చీఫ్ గా సుబోధ్ జైస్వాల్ ను నియమించింది కేంద్ర సర్కారు. ఆయన గురించి తెలియని విషయాలు మీకోసం.. 1962లో జన్మించిన సుబోధ్ జైస్వాల్ ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్లో పనిచేశారు. రూ.20 వేల కోట్ల స్టాంపు పేపర్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేశారు. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల సమయంలో సీపీగా ఉన్నారు. మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలందించారు. …

Read More »

కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలు

కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… 1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. 4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. 8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat