rameshbabu
March 23, 2021 NATIONAL, SLIDER
794
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒలెక్ర్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకొని 50 బస్సులను సరఫరా చేసింది. ఆ రాష్ర్ట ప్రజలు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సులను మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ రూపొందించింది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని …
Read More »
rameshbabu
March 23, 2021 SLIDER, TELANGANA
495
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం …
Read More »
rameshbabu
March 23, 2021 SLIDER, TELANGANA
510
తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …
Read More »
rameshbabu
March 23, 2021 NATIONAL, SLIDER
904
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో 199 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు …
Read More »
rameshbabu
March 23, 2021 MOVIES, SLIDER
1,104
వెండితెరపై అలరిస్తున్న అందాల భామలు ఒక్కొక్కళ్లుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్, నిహారిక పెళ్లి చేసుకోగా, మెహరీన్ మరి కొద్ది రోజులలో భవ్య అనే వ్యక్తిని పెళ్లాడనుంది. ఇక ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజనా గల్రానీ కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. డాక్టర్ పాషా అనే వ్యక్తితో సంజనా ఇప్పటికే నిశ్చితార్ధం జరుపుకుందని తెలుస్తుండగా, వీరి వివాహం సమ్మర్‌లో ఉంటుందని శాండల్‌వుడ్ సమాచారం. ఏడాది …
Read More »
rameshbabu
March 23, 2021 SLIDER, TELANGANA
533
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూములను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామన్నారు. …
Read More »
rameshbabu
March 23, 2021 SLIDER, TELANGANA
502
సిద్దిపేట జిల్లా గోదావరి జలాలు కూడవెళ్లి వాగులోకి వస్తాయని ఎవరూ భావించలేదని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేసి హరీశ్.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. ‘‘కూడవెళ్లి వాగుకు ఇవాళ 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. గతంలో గుక్కెడు నీటి కోసం ఘోష పడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పుష్కలంగా తాగునీటితో పాటు సాగునీరు సరఫరా అవుతోంది. …
Read More »
rameshbabu
March 22, 2021 SLIDER, TELANGANA
840
ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభ వేదికగా పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. …
Read More »
rameshbabu
March 22, 2021 SLIDER, TELANGANA
639
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, …
Read More »
rameshbabu
March 22, 2021 SLIDER, TELANGANA
701
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.తనకు సహకరించిన మిత్రులకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టభద్రులందరూ ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగపూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్యర్థులను …
Read More »