తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి 1,50,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 1,26,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి… వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి. గత ఆరున్నరేండ్లలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. …
Read More »TimeLine Layout
February, 2021
-
25 February
జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు స్థానిక పరిపాలనలో మరింత భాగస్వామ్యం కల్పించడo, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు వంటి …
Read More » -
25 February
మోదీ సర్కారు సంచలన నిర్ణయం
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25లు పెరగడం గమనార్హం. వీటి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరల …
Read More » -
25 February
కాంగ్రెస్,బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్-స్వీకరిస్తారా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.వచ్చే నెల మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ …
Read More » -
24 February
“దానికైన రెడీ” అంటున్న రెజీనా
ఒక నటిగా తననుతాను నిరూపించుకునేందుకు ప్రతినాయక పాత్రలను సైతం చేసేందుకు సిద్ధమని హీరోయిన్ రెజీనా కెసాండ్రా పేర్కొంది. హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో హీరోయిన్ రెజీనా నటించగా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ.. ఒక నటిగా …
Read More » -
24 February
గ్రేటర్ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ …
Read More » -
24 February
ఇద్దరు భామలతో రవితేజ రోమాన్స్
`క్రాక్` విజయంతో ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకు పరిచయమవుతోంది. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. `ఖిలాడి` తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట. ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా …
Read More » -
24 February
కంగనా రనౌత్ కొత్త వ్యాపారం
విభిన్న రోల్స్ తో మెప్పించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కొత్త అవతారం ఎత్తనుంది. ఈసారి మూవీ కోసం కాకుండా రియల్ వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్ ప్రదేశ్లోని తన సొంతూరు మనాలిలో ఆమె ఒక కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేయనుంది. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిపింది. ‘ఈ కొత్త వెంచర్ నా కల. సినిమాలు కాకుండా నాకు ఇష్టమైనది ఆహారం అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం …
Read More » -
24 February
14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ
14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …
Read More » -
24 February
ప్రమాదానికి గురైన గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కారు
అమెరికాకు చెందిన దిగ్గజ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ కారు ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్ లోని ఓ హైవేపై అతడు వేగంగా వెళ్తుండగా ఘటన జరిగింది వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో వుడ్స్ కు గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. ఆ దేశ టైమింగ్ ప్రకారం మంగళవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం వుడ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అతడి కాలికి వైద్యులు సర్జరీ చేశారు.
Read More »