14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదు.