తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి 1,50,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు.
వీటిలో 1,26,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి… వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి.
గత ఆరున్నరేండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో 30,594 పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి.