దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంది మరణించారు. మరో 1,48,609 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో వైరస్ వల్ల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 11,904 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీ రేటు …
Read More »TimeLine Layout
February, 2021
-
8 February
సిద్దిపేటలో మంత్రి హారీష్ బిజీ బిజీ
సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నియోజకవర్గంలోని నంగునూర్ మండలం గట్లమాల్యాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.22 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అదేవిధంగా రూ.9 లక్షలతో కొత్తగా నిర్మించిన గంగిరెద్దుల భవనం, రూ.7.5 లక్షతో నిర్మించిన డంప్ షెడ్డు, రూ. 60 లక్షల వ్యయంతో …
Read More » -
8 February
చెమటలు పుట్టిస్తున్న తమన్నా అందాలు
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు చాలా స్లిమ్‌గా, క్యూట్‌గా ఉండేది. కాని కరోనా నుండి కోలుకున్న తర్వాత ఆమె శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. కొంచెం బొద్దుగా మారిన విషయాన్ని గమనించిన ఈ ముద్దుగుమ్మ స్లిమ్‌గా మారేందుకు జిమ్‌లో నానా కష్టాలు పడుతుంది. వెరైటీ వర్కవట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. రీసెంట్‌గా బ్లాక్ ప్యాంట్, రెడ్ కలర్ టాప్ ధరించిన తమన్నా హాట్ …
Read More » -
8 February
టీమిండియా 337 పరుగులకు ఆలౌట్
చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్లకు 257 పరుగులతో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లి సేన.. మరో 80 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన తర్వాత అవతలి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా …
Read More » -
8 February
తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు
తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,682కు చేరింది. ఇక నిన్న ఒకరు కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,611కు పెరిగింది. నిన్న 197 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,842 యాక్టివ్ కేసులున్నాయి.
Read More » -
8 February
మీరు బరువు తగ్గాలంటే..?
మీరు బరువు తగ్గాలంటే కింద చెప్పినవి చేస్తే చాలు.. నీళ్లు ఎక్కువగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి రోజూ మొలకెత్తిన పెసలు తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి
Read More » -
8 February
నడకతో ఎన్నో ప్రయోజనాలు
నడకతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మీకు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్జీమర్స్ ను అడ్డుకుంటుంది కీళ్లు, వెన్నునొప్పి తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
Read More » -
8 February
కరోనా పన్నుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్కారు ‘కరోనా’ పన్ను విధిస్తుందనే వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కరోనాకు సంబంధించి పన్ను/సెస్ విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. గత 3 నెలల్లో GST ఆదాయం పెరిగిందన్నారు దేశాభివృద్ధి కోసం SBI వంటి పరిమాణంలో మరో 20 సంస్థల అవసరం ఉందన్నారు.
Read More » -
8 February
144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి..?
వెస్టిండీస్ నయా సంచలనం కైల్ మేయర్స్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన అరంగేట్ర మ్యాచులోనే డబుల్ సెంచరీ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మన్ అరుదైన రికార్డు సాధించాడు. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచులోనే నాలుగో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 310 బంతుల్లోనే 20 ఫోర్లు సిక్సర్లతో 210 రన్స్ చేసి విండీస్కు మరపురాని విజయాన్ని …
Read More » -
8 February
తెలంగాణ సీఎం మార్పుపై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు.సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »