* రోజూ నీరు ఎక్కువగా తాగాలి * రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి *బ్రేక్ ఫాస్టు క్రమం తప్పకుండా తీసుకోవాలి *కంప్యూటర్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, కంప్యూటర్ కు దూరంగా ఉండి పనిచేయాలి *కాఫీ ఎక్కువగా తాగకూడదు *స్మోకింగ్, ఆల్కాహాలకు దూరంగా ఉండాలి *యోగా, మెడిటేషన్ చేయాలి * రోజూ వ్యాయామం చేయాలి
Read More »TimeLine Layout
January, 2021
-
27 January
అబ్బాయిలు ఈ వార్త మీకోసమే..?
సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిలను ఎరవేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైబరాబాద్ CP సజ్జనార్ హెచ్చరించారు. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్ చేయిస్తూ అబ్బాయిలను ముగ్గులోకి దించుతున్నారని చెప్పారు. రెచ్చగొట్టి బట్టలు విప్పించి, ఆ వీడియోను రికార్డు చేస్తారని తెలిపారు. ఆ వీడియోను బాధితులకు పంపించి.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు
Read More » -
27 January
రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More » -
27 January
తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం …
Read More » -
27 January
బంగారు తెలంగాణకు పునాదులు-గవర్నర్ తమిళిసై
సరికొత్త విజన్, కొత్త పథకాలు, నూతన ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిందని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ అన్నారు. ఆరున్నరేండ్లలో ఆకలిదప్పులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ పతాకావిష్కరణ చేసి.. వివిధ భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు.ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మండలి చైర్మన్ …
Read More » -
27 January
స్వావలంబిత సామ్యవాది సీఎం కేసీఆర్….
దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించేది కేంద్రమే తప్ప రాష్ర్టాలు కాదు. దాన్ని రాష్ర్టాలు శిరసావహించాలి. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల పయనానికి మూడు దశాబ్దాలు దాటింది. ఆర్థిక సంస్కరణ అనేది ప్రజల కోసం జరగాలి. అలా జరిగినవాటిని, జరుగుతున్న వాటిని స్వాగతిద్దాం. కానీ సంస్కరణ అంటే వ్యాపారం/వ్యాపారుల కోసమే జరగడం పట్లనే అభ్యంతరాలు. సంస్కరణలకూ ఓ పద్ధతి, ప్రజానుకూలత పాటించకపోవడం వల్లనే దేశంలో మౌలిక సదుపాయాలకు పెను ప్రమాదం వచ్చి …
Read More » -
26 January
సచివాలయ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
నూతన సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవనాల నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. నిర్మాణ పనుల్లో నిమగ్నమైవున్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెక్రటేరియట్ ప్రధాన గేట్ తో పాటు,ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలతో సహా, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కలియ తిరగారు. డిజైన్లను పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి …
Read More » -
26 January
పారే నీళ్లను చూడలేని కళ్లు!
‘ఇది కాళేశ్వరం కాదు, తెలంగాణకు పట్టిన శనేశ్వరం.. వరదలు వస్తే మోటర్లు బంజేసుకునే ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది అంటే, అది మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే.. రీ డిజైన్‌లో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో మోటర్లను 800 అడుగుల నుంచి 821 అడుగుల వద్ద వరదకు అందనంత ఎత్తులో పెట్టారు..’ ఇవీ.. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన మెసేజ్‌లు. మిడిమిడి జ్ఞానంతో, కాళేశ్వరం …
Read More » -
26 January
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి ఆర్టీసీ బస్ పాస్లు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ పాస్లు జారీ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించి బస్పాస్ కోడ్ పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్ధులకే బస్ పాస్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బస్పాస్లను పొందే విద్యార్ధులు తమ విద్యా సంస్థ బస్పోస్ కోడ్ తో సహా నిర్దేశిత పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..
Read More » -
26 January
క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా..!
శ్రీలంకతో రెండో టెస్టులో ఇంగ్లండ్ అరుదైన రికార్డు నమోదు చేసింది. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో పేలో 10 వికెట్లు, మరో ఇన్నింగ్స్లో స్పిన్ తో 10 వికెట్లు తీసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ ఘనతను ఏ టీం సాధించలేదు. తొలి ఇన్నింగ్స్లో పేసర్లు అండర్సన్ (6), వుడ్ (3), కరన్ (1) చొప్పున 10 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు డామ్ బెస్ (4), …
Read More »