Home / ANDHRAPRADESH / తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.

తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం తర్వాత కాణిపాకం, శ్రీకాళ హస్తి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.