TimeLine Layout

January, 2021

  • 25 January

    తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు

    తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,590కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,234 ఉండగా వీరిలో 1,697 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,88,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

    Read More »
  • 25 January

    ప్రభాస్ తో శృతి రోమాన్స్

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతిని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించి, కథ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో నటించేందుకు శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    Read More »
  • 25 January

    శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

    శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్లను పదివేల నుంచి 20 వేలకు పెంచింది. ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు. భూదేవి కాంప్లెక్స్ లోనూ ఈ టోకెన్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లను పెంచటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Read More »
  • 25 January

    మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్

    మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి …

    Read More »
  • 25 January

    దేశంలో కొత్తగా 13,203కరోనా కేసులు

    దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇక నిన్న కరోనాతో 131 మంది ప్రాణాలు కోల్పోయారు..  ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,53,470కు చేరింది. ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు.

    Read More »
  • 25 January

    విభిన్న పాత్రలో జగ్గుభాయ్

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో జగ్గుభాయ్ నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ వేసినట్లు కనిపిస్తోంది. దానికి ఎటువంటి క్యాప్షన్ రాయలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రంలో ‘ఏసుప్రభు’గా యాక్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం జగపతిబాబు FCUK చిత్రంలో నటిస్తూ బిజీగా …

    Read More »
  • 25 January

    సీఎం జగన్ కు మాజీ మంత్రి యనమల వార్నింగ్

    ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులను సహకరించకుండా చేస్తూ వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గుర్తించాలని సూచించారు. నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనమని చెప్పటం సరికాదని మండిపడ్డారు. స్థానిక పాలన అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు

    Read More »
  • 25 January

    నెక్సాస్ హాస్పిట‌ల్ ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

    తెలంగాణలో హైద‌రాబాద్ షేర్ లింగంప‌ల్లిలో తొర్రూరు డాక్ట‌ర్ సోమేశ్వ‌ర‌రావు కుమారుడి నెక్సాస్ హాస్పిట‌ల్ ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.అనంత‌రం హాస్పిట‌ల్ లోని వివిధ విభాగాల‌ను ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూత‌న హాస్పిట‌ల్ ని ప్రారంభించిన డాక్ట‌ర్ సోమేశ్వ‌ర‌రావు, అత‌డి కుమారుడు, కుటుంబ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. హాస్పిట‌ల్ బాగా న‌డ‌వాలని ఆకాంక్షించారు. …

    Read More »
  • 25 January

    త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశం

    వేతన సవరణ, సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.వేతన సవరణ సంఘం కొద్దిరోజుల క్రితం సీఎంకు నివేదిక సమర్పిచింది. నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వారం, పదిరోజుల్లో …

    Read More »
  • 24 January

    షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

    వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్‌’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat