Home / ANDHRAPRADESH / షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్‌’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు.

షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టడం మేలని, తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వీహెచ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయని, ఏపీలో అయితే జగన్ వ్యతిరేకులు షర్మిల వెంట వస్తారని చెప్పారు. జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలని వీహెచ్ సూచించారు.