శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్లను పదివేల నుంచి 20 వేలకు పెంచింది. ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు. భూదేవి కాంప్లెక్స్ లోనూ ఈ టోకెన్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లను పెంచటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.