TimeLine Layout

October, 2020

  • 28 October

    ఏపీ ,తెలంగాణకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ షాక్

    దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీఆర్‌ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందించాయి. …

    Read More »
  • 28 October

    రైతు బంధు వులంతా పేదరైతులే

    రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్‌లో ప్రభుత్వం మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేసింది. వీరిలో సన్నకారు రైతులే (2.47 ఎకరాలలోపు భూమి ఉన్నవారు) 40.46 లక్షల మంది ఉన్నారు. ఇక చిన్నకారు రైతులు (2.48-4.94 ఎకరాలు) 11.33 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు …

    Read More »
  • 28 October

    నేటి నుండి రాత్రి 9.30వరకు మెట్రో రైళ్లు

    ప‌్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ మెట్రో రైళ్ల రాక‌పోక‌ల స‌మ‌యాన్ని అధికారులు పొడిగించారు. దీంతో నేటి నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు విరామాల‌తో రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కు రైళ్ల‌ను న‌డిపారు. అయితే ర‌ద్దీ పెర‌గ‌డంతో రైళ్ల స‌మ‌యాల‌ను మ‌రో అర‌గంట పాటు పొడిగించారు. ప్ర‌తి మూడు నిమిషాల‌కో రైలు అందుబాటులో ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ‌ కరోనా నేపథ్యంలో మార్చి …

    Read More »
  • 28 October

    ఫార్మా బ్రాండ్‌ హైదరాబాద్‌

    ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో గ్రాన్యూల్స్‌ ఇండి యా, లారస్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం తాము హైదరాబాద్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో …

    Read More »
  • 28 October

    ఆకులు కాదు పూవ్వులే

    తెలంగాణ రాష్ట్రంలో జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి జిల్లాలోని మహా‌ము‌త్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూప‌రులను ఆక‌ట్టు‌కుం‌టు‌న్నాయి. దూరం నుంచి చూస్తే పూల మాది‌రిగా, దగ్గ‌రికి వెళ్లి చూస్తే ఆకు‌లని తెలిసి ప్రజలు ఆశ్చ‌ర్య‌పో‌తు‌న్నారు.

    Read More »
  • 28 October

    రఘునందన్ కు మంత్రి హారీష్ రావు సవాల్

    ‘‘దేశంలో ఎవరింట్లో డబ్బులు దొరికినా తనవేనని బద్నాం చేస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటున్నారు. ఎవరింట్లోనో డబ్బులు దొరికితే నీకు భయమెందుకు? అక్కడికి వెళ్లి నువ్వెందుకు అతి చేశావు? దుబ్బాకలో ప్రచారం పక్కనబెట్టి సిద్దిపేట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల చేతుల్లోంచి డబ్బులు ఎందుకు లాక్కున్నారు?’’ అని మంత్రి హరీశ్‌రావు.. రఘునందన్‌ రావును ప్రశ్నించారు. డిపాజిట్‌ ఓట్లు కూడా దక్కవనే ఆలోచనతో రాజకీయ సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి …

    Read More »
  • 26 October

    బెంగళూరుపై చెన్నై ఘన విజయం

    ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై …

    Read More »
  • 26 October

    బీజేపీ పార్టీ వదంతుల పుట్ట.అబద్ధాల గుట్ట

    బీజేపీ పార్టీ వందతుల పుట్ట, అబద్ధాల గుట్ట. దివాలాకోరు మాటలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. అందుకే ఏళ్ల తరబడి ఆ పార్టీలో ఉన్నవారంతా విశ్వసనీయత కలిగిన టీఆర్‌ఎస్‌ వైపు వస్తున్నారు. ఆ పార్టీ కమిటీలన్నీ కారెక్కుతున్నాయి’’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దౌల్తాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో  ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుప్రియాల్‌, షాపూర్‌, బందారం, నర్సంపేట, శేరుపల్లి, లింగాయ్‌పల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు టీఆర్‌ఎ్‌సలో …

    Read More »
  • 26 October

    డ్రగ్స్ కొంటూ అడ్డంగా దొరికిన నటి

    దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత కొన్ని నెలలుగా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కు తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా ఎన్‌సీబీ చేతికి చిక్కింది. ‘సంవాదన్ …

    Read More »
  • 26 October

    ఏపీలో తగ్గిన కరోనా కేసులు

    ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు  కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 80,7,023కి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య చేరింది. 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat