TimeLine Layout

October, 2020

  • 19 October

    పటిష్ఠంగా సఖీ కేంద్రాలు

    మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని, ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాలను పటిష్టం చేయడం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు, ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు భద్రత, భవిష్యత్ కల్పించడం వంటి అంశాలపై నేడు మహిళాభివృద్ధి, …

    Read More »
  • 19 October

    ఏపీలో కరోనా తగ్గుముఖం

    ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …

    Read More »
  • 19 October

    ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్‌.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు. ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని …

    Read More »
  • 17 October

    దేశంలో కరోనా కేసులు 74 లక్ష‌లు

    దేశంలో క‌రోనా వైర‌స్ కొద్దిగా శాంతించిన‌ట్లు క‌న్పిస్తున్న‌ది. కొత్త‌గా న‌మోద‌వుతున్న‌ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 62 వేల మందికి క‌రోనా సోకింది. అదేవిధంగా చాలా రోజుల త‌ర్వాత యాక్టివ్ కేసులు 7 ల‌క్ష‌ల‌కు దిగివ‌చ్చాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 62,212 క‌రోనా పాటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య …

    Read More »
  • 17 October

    కరోనాను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ టాప్

     కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని …

    Read More »
  • 16 October

    ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం

    ఏపీలో గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు గురువారం రాత్రి దాడికి యత్నించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ కారులో బయల్దేరగా.. ఎదురుగా వచ్చిన పూర్ణచంద్రరావు తన బైక్‌ను అడ్డుపెట్టి అసభ్య పదజాలంతో దూషించాడు. ఎవరని ప్రశ్నించగా దాడి చేసేందుకు మీదకు రావడంతో భద్రతా …

    Read More »
  • 16 October

    ట్రంప్ కు ట్విట్టర్ షాక్

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్ర్తంప్ కు చెందిన క్యాంపెయిన్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది.డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ కుమారుడిపై ట్రంప్ బృందం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నిబంధనలకు విరుద్ధమని టీమ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ట్విట్టర్ పై రిపబ్లికన్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. సంస్థ తీర్పుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

    Read More »
  • 16 October

    భార్యపై అనుమానంతో..!

    అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు. తన భార్యఅనంతసాగర్‌ గ్రామానికి చెందిన …

    Read More »
  • 16 October

    వరద నష్టం రూ.5వేల కోట్లు

    భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …

    Read More »
  • 16 October

    తెలంగాణలో కొత్తగా 1,554కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల వరకు మొత్తం 43,916నమూనాలను పరీక్షించగా 1,554మందికి కరోనా పాజిటీవ్ అని నిర్థారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అయితే గురువారం ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1256కి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat