ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
తాజాగా తూర్పుగోదావరిలో 468 మందికి వైరస్ సోకగా.. పశ్చిమగోదావరిలో 447, చిత్తూరులో 380 పాజిటివ్‌లు బయటపడ్డాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 24 మంది కరోనాతో మరణించారు.