Home / NATIONAL / దేశంలో కరోనా కేసులు 74 లక్ష‌లు

దేశంలో కరోనా కేసులు 74 లక్ష‌లు

దేశంలో క‌రోనా వైర‌స్ కొద్దిగా శాంతించిన‌ట్లు క‌న్పిస్తున్న‌ది. కొత్త‌గా న‌మోద‌వుతున్న‌ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 62 వేల మందికి క‌రోనా సోకింది. అదేవిధంగా చాలా రోజుల త‌ర్వాత యాక్టివ్ కేసులు 7 ల‌క్ష‌ల‌కు దిగివ‌చ్చాయి.

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 62,212 క‌రోనా పాటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 74,32,681కు చేరింది. ఇందులో 7,95,087 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గ‌త రెండు నెల‌న్న‌ర రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత త‌క్కువ‌గా ఉండ‌టం ఇదే మొద‌టిసారి. మొత్తం కేసుల్లో 65,24,596 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. అదేవిధంగా క‌రోనాతో కొత్త‌గా 837 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతులు 1,12,998కి చేరార‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌కటించింది.