బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ . పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి …
Read More »TimeLine Layout
May, 2020
-
11 May
గుండెపోటుతో దర్శకుడు మృతి
ఇటీవల బాలీవుడ్‌లో ఇద్దరు లెజెండ్స్ కన్నుమూయగా, వారి మరణం చిత్ర పరిశ్రమకి తీరనిలోటుగానే ఉంటుంది. ఇక మలయాళ పరిశ్రమలోను రీసెంట్‌గా ఓ మలయాళ నటుడు కారు ప్రమాదంలో కన్నుమూసాడు. ఈ విషాదం మరచిపోక ముందే మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం చెందారు. అంత చిన్న వయస్సులో ఆయన మృతి చెందడాన్ని ఆయన కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. జిబిత్ దర్శకుడిగా రాణించాలని ఎన్నో కలలు కన్నారు. కాని ఆ …
Read More » -
11 May
మంత్రి కేటీఆర్ పిలుపు
సీజనల్ వ్యాధుల నివారణకోసం పురపాలకశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ ను ఆదివారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. తన నివాసంలో ఉన్న పూల కుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలిగించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు పేరుకుపోయిందా అని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహామేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యంపైన ప్రత్యేక స్పృహ …
Read More » -
11 May
హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు
కేరళ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అనుమానిత లక్షణాలున్నవారుంటే..వాళ్లు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని నిర్ణయించింది. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆస్పత్రిలో చేరాల్సిందేనని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైలజ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు …
Read More » -
11 May
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చేనేత, టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు (యార్న్) అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే రెండేండ్లపాటు చేనేతవస్ర్తాలపై పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపులను పరిశీలించాలని సూచించారు. లక్షల మందికి ఉపాధి కల్పించే చేనేత, టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ రంగంపై ఆధారపడినవారికి భరోసా కల్పించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర …
Read More » -
11 May
హాట్ యాంకర్ కు బాలీవుడ్ ఆఫర్.!
బుల్లితెరకి గ్లామర్ అద్దిన అందాల యాంకర్ అనసూయ. ఒకవైపు యాంకర్‌గా చేస్తూనే అడపాదడపా ముఖ్య పాత్రలు చేస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ప్రస్తుతం అనసూయకి హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన అనసూయకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు …
Read More » -
10 May
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో …
Read More » -
10 May
లాక్‌డౌన్ వేళ.. ఆన్‌లైన్ ప్రేమ
లాక్‌డౌన్ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్‌లైన్’ బాట పట్టారు. లాక్‌డౌన్‌తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్ యాప్‌లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా …
Read More » -
10 May
జర్నలిస్టులకు అండగా కమల్ హసన్
కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్‌లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి …
Read More » -
10 May
జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్
లాక్‌డౌన్ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ స్టూడియోలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటికే …
Read More »