Home / MOVIES / హాట్ యాంక‌ర్ కు బాలీవుడ్ ఆఫర్.!

హాట్ యాంక‌ర్ కు బాలీవుడ్ ఆఫర్.!

బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల యాంక‌ర్ అన‌సూయ‌. ఒక‌వైపు యాంక‌ర్‌గా చేస్తూనే అడ‌పాద‌డ‌పా ముఖ్య పాత్ర‌లు చేస్తుంది. అప్పుడ‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ప్ర‌స్తుతం అన‌సూయ‌కి హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌తో న‌టిగా మంచి మార్కులు కొట్టేసిన అన‌సూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ఆచార్య‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ‌కి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

అయితే ఇది సినిమా కాదులేండి. సీరియ‌ల్‌. హిందీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళుతున్న సీరియ‌ల్‌లో ముఖ్య పాత్ర కోసం అన‌సూయ‌ని అడిగార‌ట‌. మ‌రి ఇందుకు ఈ అమ్మ‌డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా లేదా అనేది రానున్న రోజుల‌లో తెలుస్తుంది.