రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు . భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టు బడిసాయంగా 8 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు . ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ …
Read More »TimeLine Layout
April, 2018
-
30 April
ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!
మే 12 ….అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని…నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ నర్స్ అవార్డ్ లు ఇస్తున్నట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( NOA) ఓ ప్రకటనలో తెలిపింది. సమాజ హితం కోసం, ఆరోగ్య రక్షణ కోసం….ప్రాణాలు నిలబెట్టే క్రమంలో ఎన్నో బాధలను పంటికొన కింద ఓర్పుతో భరిస్తున్న సేవామూర్తులను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా వారిని అవార్డ్ తో సత్కరించనున్నట్టు తెలిపారు …
Read More » -
30 April
40ఏళ్ళల్లో చంద్రబాబు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్న జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడ్ని అని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో తీసుకొని నిర్ణయాన్ని జగన్ తీసుకొని బాబు అండ్ బ్యాచ్ ను ఇరుకులో పడేశారు.అసలు విషయానికి గత నాలుగున్నర నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప …
Read More » -
30 April
వైఎస్ జగన్‌ను కలిసి కంటతడిపెట్టిన ఎన్టీఆర్ బంధువులు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొనసాగుతోంది. అయితే, ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, పరిష్కార మార్గాలపై …
Read More » -
30 April
దేశ్‌కి నేత కేసీఆర్…సీఎం కేసీఆర్‌కు తమిళ ప్రజల బ్రహ్మరథం..!!
గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు టూర్ లో భాగంగా ఆదివారం చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన సందర్భంగా సీ ఎం కేసీఆర్ కు అక్కడి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు, కరుణానిధి నివాసం, స్టాలిన్ నివాసం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు . దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ తమిళంలో, హిందీలో పెద్ద ఎత్తున …
Read More » -
29 April
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి..సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… డీఎంకేతో మొదటి యూపీఏ ప్రభుత్వంలో పని చేసినట్లు గుర్తు చేశారు. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు . స్టాలిన్ తో చాలా విషయాలు చర్చించామన్నారు. ఇది ప్రారంభం కాదు..ముగింపుకాదు మా స్నేహం …
Read More » -
29 April
ఫెడరల్ ఫ్రంట్..కీలక బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్
దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం..,తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు …
Read More » -
29 April
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ..చరిత్ర సృష్టించిన ధోని ..!
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ మాజీ ఆటగాడు ,ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి …
Read More » -
29 April
తెలంగాణ జనసమితి సభ ప్రధాన వేదికపై వెయ్యి మంది ..!
తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి నిన్న శనివారం రాజీనామా చేసిన ప్రో కోదండరాం గతంలో తెలంగాణ జనసమితి పేరిట కొత్త రాజకీయ పార్టీను పెట్టిన సంగతి విదితమే .అందులో భాగంగా నేడు ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్లో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగనున్నది . అందులో భాగంగా ఈ వేడుక సందర్బంగా బహిరంగ సభ జరగనున్నది …
Read More » -
29 April
కరుణానిధితో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్, డీఎంకే శ్రేణులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి …
Read More »