Home / TELANGANA / రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి తుమ్మల

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి తుమ్మల

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు . భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టు బడిసాయంగా 8 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు . ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముచ్చెర్లలో నిర్మించిన వ్యవసాయ గోడౌన్‌, రెండు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. పేద గిరిజనుల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు.