తమ ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు వరుస వికెట్లు తీస్తూ ఒత్తిడి పెట్టినప్పుడు మేం పుంజుకోవాల్సి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆటగాళ్లు. వాళ్లపై ఒత్తిడి పెట్టబోం. వాళ్లిద్దరూ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాం. మావాళ్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఒక దశలో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ మావాళ్లు …
Read More »TimeLine Layout
September, 2021
-
27 September
టెస్ట్ క్రికెట్ కు మొయిన్ అలీ రిటైర్మెంట్
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్ ఐపీఎల్ ఆడుతున్న అలీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే అంతకాలం ఇంటికి దూరంగా ఉండలేనని భావించిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 64 టెస్టులు, 112 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.
Read More » -
27 September
విచారణకు సజ్జనార్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్ కౌంటర్పై.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ VS సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్ కౌంటర్ టైంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న VC సజ్జనార్ను తొలిసారిగా కమిటీ విచారించనుంది. ఆయనకు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దిశ ఎన్ కౌంటర్పై NHRC నివేదికపై నేడు విచారణ జరగనుంది.
Read More » -
27 September
టాలీవుడ్ లో విషాదం
ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మరణించారు. RR మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ పలు చిత్రాలు నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మ్యాన్, పైసా వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. వెంకట్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read More » -
27 September
మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో RGV
ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొండా పేరుతో సినిమాను ప్రకటించిన RGV.. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని సినిమాగా మలచనున్నాడు. తాజాగా ఓ టీజర్ను విడుదల చేసిన RGV.. ‘ఎన్ కౌంటర్లో చంపేయబడ్డ రామకృష్ణ (RK)కి, కొండా మురళికి ఉన్న మహా బంధం గురించి వివరిస్తా. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాపై ఫస్ట్ హ్యాండ్ సమాచారం పొందాను’ …
Read More » -
26 September
నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల …
Read More » -
26 September
బ్లాక్ డ్రస్ లో అదిరిపోయిన అందాల ముద్దుగుమ్మ
అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఒకప్పుడు వరుస సినిమాలతో తెగ సందడి చేసేది. కాని మధ్యలో జోరు తగ్గించింది. ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలతో తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు తమిళంలోను కూడా సినిమాలు చేస్తుంది రాశీ ఖన్నా. …
Read More » -
26 September
బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు
బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతుల …
Read More » -
26 September
తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి
సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన …
Read More » -
26 September
దేశంలో కొత్తగా 28,326 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా, 3,29,02,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,46,918 మంది కరోనా వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 26,032 మంది కొత్తగా వైరస్ నుంచి బయటపడ్డారని, 260 మంది మరణించారని తెలిపింది. కాగా, కొత్తగా నమోదైన …
Read More »