Home / SLIDER / ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోము-రోహిత్ శర్మ

ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోము-రోహిత్ శర్మ

తమ ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు వరుస వికెట్లు తీస్తూ ఒత్తిడి పెట్టినప్పుడు మేం పుంజుకోవాల్సి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆటగాళ్లు.

వాళ్లపై ఒత్తిడి పెట్టబోం. వాళ్లిద్దరూ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాం. మావాళ్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఒక దశలో  రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ మావాళ్లు కట్టడి చేశారు’ అని రోహిత్ శర్మ అన్నాడు