Home / SLIDER /  బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు

 బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు

 బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు.

శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్‌ కనెక్షన్లు, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మ్యుటేషన్‌ పత్రాలు, నల్లా, విద్యుత్‌ కనెక్షన్లు, విద్యుత్‌ మీటర్ల మార్పు పత్రాలను టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అందజేస్తోందన్నారు.

ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. తన బాధను ప్రజల మీద రుద్దుతూ ఓ పెద్ద మనిషి లబ్ధి పొందాలని అనుకుంటున్నాడని పరోక్షంగా ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎ్‌సను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.