పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …
Read More »TimeLine Layout
August, 2021
-
25 August
ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్‌కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. …
Read More » -
25 August
పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు ఉంటుందా..?
ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక రక్తపోటు బారినపడుతున్నారని వీరు సకాలంలో వ్యాధిని గుర్తించలేకపోవడంతో గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవన శైలి వ్యాధి అయిన బీపీని సులభంగా గుర్తించే వెసులుబాటుతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన మందులతో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది తమకు బీపీ ఉందనే విషయం తెలియడం లేదని దీంతో తీవ్ర అనారోగ్యాలు …
Read More » -
25 August
ఇస్రోలో జాబ్స్.. నెలకు రూ.63 వేల వరకు జీతం..
హెవీ వెహికిల్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు లైట్ వెహికిల్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు కుక్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 …
Read More » -
25 August
ఆస్తులు అమ్మి అచ్ఛేదిన్ అంటారా?
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం.సహజ వనరులైన గనులు మొదలుకొని రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలను అమ్మబోతున్నట్లు కేంద్రం ప్రకటించటం గర్హనీయం. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వమూ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించలేదు, అమ్మకానికి పెట్టలేదు. …
Read More » -
25 August
భారత్‌లో దీర్ఘకాలంగా కరోనా
భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఊహకందని హెచ్చరిక జారీ చేశారు. భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి స్థానికత స్థాయికి చేరింది. ఫలితంగా ఇది స్వల్పంగా లేదా మధ్యస్థంగా వ్యాప్తి చెందుతుంటుందన్నారు. ఇటువంటి పరిస్థితిలో జనం ఈ వైరస్‌తో సహజీవనం చేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుందన్నారు. దేశంలోని …
Read More » -
25 August
అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కలైవానర్ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు …
Read More » -
25 August
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది, అగ్రికల్చల్, మెడికల్ స్ట్రీమ్‌కు 91.19 …
Read More » -
25 August
దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.99 …
Read More » -
25 August
తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్ చైర్మన్-1గా ఉన్న ఆయనను కౌన్సిల్ నూతన అఫిషియేటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్ పాపిరెడ్డి చైర్మన్ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు. 2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని …
Read More »