తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు హుజురాబాద్లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే నిధులు ఇస్తున్నారు. హుజురాబాద్లో అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. మిగతా చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం ఏంటి?’ …
Read More »TimeLine Layout
July, 2021
-
26 July
తెలంగాణలో కొత్తగా 494 కొవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో కరోనాతో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,41,153కు చేరింది. మొత్తంగా 3,784 మంది కరోనా ధాటికి మరణించారు. కొత్తగా 710 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, రికవరీల సంఖ్య 6,27,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులున్నాయి.
Read More » -
26 July
భక్తుల బాధ్యత నాదే.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని, …
Read More » -
26 July
యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ …
Read More » -
26 July
ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరారు. ఎంపిక చేసిన 427 మందితో 16 బస్సులు హుజూరాబాద్ నుంచి పయణమయ్యాయి. ఈ బస్సులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ పాల్గొన్నారు. పథకం అమలు, …
Read More » -
25 July
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు.
Read More » -
25 July
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం పట్ల రాష్ట్ర వ్యాస్తంగా సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది. పార్టీలకు అతీతంగా దళితులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు. దళితుల కష్టాలను తొలగించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కృతజ్ఞతాభావంతో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్తా కేలో దళితులు, స్థానిక నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Read More » -
25 July
ప్రతి రోజు ఓ గుణపాఠం -శృతిహసన్
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలాన్ని పూర్తిచేసుకుంది తమిళ సొగసరి శృతిహాసన్. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా తనపై ఎంతో ప్రేమాభిమానాల్ని కనబరిచారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్ తాలూకు అరుదైన ఫొటోల్ని షేర్ చేసింది. శృతిహాసన్ మాట్లాడుతూ ‘సినీ ప్రయాణంలో అప్పుడే పన్నెండేళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి లక్ష్యం లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నిత్యవిద్యార్థినిలా …
Read More » -
25 July
మెగా హీరో కోసం తమన్నా సరికొత్తగా
ఇటీవల ‘దోచెయ్ దోర సొగసలు దోచెయ్ …’ అంటూ ‘కె.జి.యఫ్ చాప్టర్1’లో రాఖీ భాయ్‌తో ఆడి పాడి మిల్కీ బ్యూటీ కుర్ర కారుని హృదయాలను దోచుకుంది. అలాగే ‘డ్యాంగ్ డ్యాంగ్…’ అంటూ సూపర్‌స్టార్ మహేశ్‌తో చిందేసి ప్రేక్షకుల హృదయాల్లో గంట కొట్టి, మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడుకి సిల్వర్ స్క్రీన్‌పై స్పెషల్ సాంగ్స్‌లో మెరవడం కొత్తేమీ కాదు. అంతకు ముందు ‘అల్లుడు శీను, జాగ్వార్, జై లవకుశ’ వంటి చిత్రాల్లోనూ …
Read More » -
25 July
దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా దళిత బంధు – సీఎం కేసీఆర్
దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి సీఎం శనివారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హుజూరాబాద్ పరిధిలోని ఎస్సీలందరూ ఈ నెల 26న …
Read More »