Home / SLIDER / రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తా- ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి

రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తా- ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు హుజురాబాద్లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

‘మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే నిధులు ఇస్తున్నారు. హుజురాబాద్లో అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. మిగతా చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం ఏంటి?’ అని అన్నారు.