Home / MOVIES / మెగా హీరో కోసం త‌మ‌న్నా సరికొత్తగా

మెగా హీరో కోసం త‌మ‌న్నా సరికొత్తగా

ఇటీవల ‘దోచెయ్ దోర సొగ‌స‌లు దోచెయ్ …’ అంటూ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’లో రాఖీ భాయ్‌తో ఆడి పాడి మిల్కీ బ్యూటీ కుర్ర కారుని హృద‌యాల‌ను దోచుకుంది. అలాగే ‘డ్యాంగ్ డ్యాంగ్‌…’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో చిందేసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో గంట కొట్టి, మెస్మ‌రైజ్ చేసిన ఈ అమ్మ‌డుకి సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్పెష‌ల్ సాంగ్స్‌లో మెర‌వ‌డం కొత్తేమీ కాదు.

అంత‌కు ముందు ‘అల్లుడు శీను, జాగ్వార్‌, జై ల‌వ‌కుశ’ వంటి చిత్రాల్లోనూ  హీరోల‌తో ఆడిపాడింది. ఇప్పుడు మ‌రోసారి త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. వ‌రుణ్‌తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గ‌ని’.  ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించాల్సి ఉంది.

ఈ సాంగ్‌లో ఎవ‌ర్ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ ఆలోచించి, చివ‌ర‌కు త‌మ‌న్నా అయితే బావుంటుంద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం త‌మ‌న్నాతో మేక‌ర్స్ తుది ద‌శ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెరకెక్కుతోన్న ‘గ‌ని’ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో తుది ద‌శ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat