TimeLine Layout

July, 2021

  • 15 July

    తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. …

    Read More »
  • 14 July

    హుజురాబాద్ లో పోటీ పార్టీల మధ్య ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు

    మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌ది ఆత్మ‌గౌర‌వం కాదు.. ఆత్మ‌వంచ‌న అని పేర్కొన్నారు. ఈట‌ల త‌న‌తో పాటు.. ప్ర‌జ‌ల‌ను కూడా మోసం చేస్తున్నారు. ఈట‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ ఎంత గౌర‌విమిచ్చిందో ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. ఆయ‌న‌కు టీఆర్ఎస్ పార్టీలో జ‌రిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ …

    Read More »
  • 14 July

    కాంగ్రెస్ లోకి పీకే

    ఎన్నిక‌ల వ్యూహ‌కర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మంగ‌ళ‌వారం ఆయ‌న పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ స‌హా రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌ను కూడా క‌లిసిన విష‌యం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నిక‌లు, 2024 సాధార‌ణ ఎన్నిక‌ల గురించి ప్ర‌శాంత్ కిశోర్‌.. గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్లు భావించినా.. అంత‌కంటే పెద్ద‌దే ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం.2024 ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పార్టీలో …

    Read More »
  • 14 July

    తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద

    తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌) కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంగళవారం ముందుకొచ్చింది. రూ.1,000 కోట్లతో రాష్ట్రంలో ఇథనాల్‌ (ఫస్ట్‌ జనరేషన్‌) ప్లాంటును ఏర్పాటుచేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 100 ఎకరాల స్థలం, కావాల్సినంత నీరు అందిస్తే ప్లాంటు ఏర్పాటుచేస్తామని తెలిపింది. ప్లాంటు ఏర్పాటుకోసం బీపీసీఎల్‌ గతంలోనే రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి …

    Read More »
  • 14 July

    దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు

    గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 624 మంది వైర‌స్ బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో మొత్తం వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 41 వేలుగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైర‌స్ నుంచి రిక‌వ‌రీ …

    Read More »
  • 14 July

    డ‌యాబెటిక్‌ పేషెంట్లు గుడ్డు తినోచ్చా..?

    డ‌యాబెటిక్‌ పేషెంట్లు ఆహారం విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తిన‌గూడ‌దో తెలుసుకుని ఆరోగ్యానికి హాని క‌లుగ‌జేయ‌వు అనుకున్న వాటిని మాత్ర‌మే త‌మ మెనూలో చేర్చుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు విష‌యంలో కూడా షుగ‌ర్ పేషెంట్ల‌కు ఎన్నో అనుమానాలు ఉంటాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని చాలామంది డ‌యాబెటిక్ రోగులు భ‌య‌ప‌డుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. గుడ్లు తినని …

    Read More »
  • 14 July

    సిగరెట్‌ తాగేసిన హీరోయిన్‌

    ఓ వివాదాస్పద హీరోయిన్‌కు సిగరెట్‌ తాగే అలవాటు ఉంది. ఎవరేమంటారనులే అనుకుందేమో..లొకేషన్‌లో సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. అయితే హీరోయిన్‌ లొకేషన్‌లో సిగరెట్‌ తాగడం సదరు మూవీ డైరెక్టర్‌కి నచ్చలేదు. దాంతో ఆమెకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆమె కూడా డైరెక్టర్‌ వార్నింగ్‌ను సీరియస్‌గానే తీసుకుని లొకేషన్‌లో సిగరెట్‌ తాగడం మానేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..అన్బరసన్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేయైు కాణోమ్‌’. …

    Read More »
  • 14 July

    ఆలయాల అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని న్యూ లాల్ బహదూర్ నగర్ లో నూతనంగా చేపడుతున్న అభయాంజనేయ స్వామి ఆలయ స్లాబ్ పునః నిర్మాణ పనులను  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారు, స్థానిక డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని …

    Read More »
  • 14 July

    గురుకులాల్లో ‘స్థానిక’ గుబాళింపు

    తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాసంస్థల ప్రవేశాల్లో స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకనుంచి ఏ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు ఆ నియోజకవర్గ పరిధిలోని గురుకులాల్లోనే ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. గురుకులాల నిర్వహణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యంచేయాలని క్యాబినెట్‌ తీర్మానించింది. ఇప్పటిదాకా …

    Read More »
  • 14 July

    వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

    బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జ‌రిగింది. ఈ క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని తిల‌కించేందుకు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించుకున్నారు. మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్ర్తాలు స‌మ‌ర్పించారు. అమ్మ‌వారి క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు మంత్రులు త‌మ‌ కుటుంబ స‌మేతంగా వ‌చ్చారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ల్యాణ వేడుక‌ను నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat