Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు.

మరో ఐదుగురు వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.59శాతంగా ఉందని, రికవరీ రేటు 97.79శాతానికి చేరింది పేర్కొంది.

రాష్ట్రంలో కొత్తగా 1,15,237 కొవిడ్‌ నమూనాలను పరిశీలించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 96, జీహెచ్‌ఎంసీలో 72, కరీంనగర్‌లో 58, వరంగల్‌ అర్బన్‌లో 55, నల్లగొండలో 54, మంచిర్యాల 43, పెద్దపల్లి 41 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ  తెలిపింది.