TimeLine Layout

April, 2021

  • 25 April

    మరోసారి గ్రేటర్ వరంగల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం….

    గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా 1&2వ డివిజన్ గుండ్లసింగారం, పెగడపల్లి, వంగపహాడ్ గ్రామాలలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 1&2వ డివిజన్ అభ్యర్థులు గణిపాక కల్పన, బానోత్ కల్పన గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ …

    Read More »
  • 24 April

    తెలంగాణలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

    వ్యాక్సిన్‌ పంపిణీపై తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక …

    Read More »
  • 24 April

    నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శం

    జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్ గా ప్రసిద్ది పొందిన శ్రీ సురీందర్ కుమార్ డే (ఎస్.కె.డే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ …

    Read More »
  • 24 April

    ఎమ్మెల్యే రోజాకి సీఎం కేసీఆర్ ఫోన్

    తెలంగాణ రాష్జ్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్‌ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నైలోనే  విశ్రాంతి  తీసుకుంటున్న విషయం తెలిసిందే.  వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్‌ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.  కేసీఆర్‌  ఫోన్‌ చేసినందుకు సంతోషంగా …

    Read More »
  • 24 April

    ఖిలా వరంగల్ గౌడన్నల మద్దతు టీఆర్ఎస్ కే..

    ఖిలావరంగల్ గౌడ సంఘం మద్దతు టీఆర్ఎస్ కు తెలిపారు..వరంగల్ రాజశ్రీ గార్డెన్ లో తీగల జీవన్ గౌడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 38 డివిజన్ టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్థి ఉమ దామోదర్ యాదవ్,37 డివిజన్ అభ్యర్థి వేల్పుగొండ సువర్ణ – బోగి సురేష్ లతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గౌడన్నల కు ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తానన్నారు..ఖాలీ …

    Read More »
  • 24 April

    మహేష్ బాబుతో ఇస్మార్ట్ బ్యూటీ

    ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిధిని పరిశీలిస్తున్నారట. అయితే మహేష్ సినిమాలో నిధి మెయిన్ రోల్లో కనిపిస్తుందా. లేక సెకండ్ హీరోయినా అన్నది చూడాలి.

    Read More »
  • 24 April

    GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …

    Read More »
  • 24 April

    తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్‌ వేవ్‌లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ …

    Read More »
  • 24 April

    నాగశేఖర్ గౌడ్ గారు లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగశేఖర్ గౌడ్ గారి అకాల మరణం పట్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చింతల్ లోని తన కార్యాలయం వద్ద నాగశేఖర్ గౌడ్ గారి ఫోటో కు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు …

    Read More »
  • 24 April

    వైద్యారోగ్య శాఖ‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు..

    ‌తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల‌లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డం, దీనికి తోడు అన్ని ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండి ఉన్న నేప‌థ్యంలో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. రోగులు ఎక్కువ ఉన్న …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat