తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు.సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు …
Read More »TimeLine Layout
April, 2021
-
22 April
తెలంగాణలో పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్ ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో …
Read More » -
21 April
ఇది తెలంగాణ విజయం – మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానాన్ని కేంద్రం ఆమోదించడం సంతోషకరం అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడం తెలంగాణ విజయం అని అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోనల్ విధానంతో యువత న్యాయమైన వాటా పొందొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More » -
21 April
ధోనీ తల్లిదండ్రులకు కరోనా
సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం …
Read More » -
21 April
తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. మే 26 చివరి వర్కింగ్ డే అని ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పది పరీక్షలను రద్దు చేసినా, టీచర్లు మాత్రం రోజూ డ్యూటీకి హాజరవుతున్నారు. కరోనా నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించి, 24 నుంచి సెలవులు …
Read More » -
21 April
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ కు ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే దూరం కాగా తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గతేడాదిగా బయో బబుల్లో ఉంటున్నానని చెప్పిన అతను నిన్న రాత్రి స్వదేశానికి పయనమయ్యాడు. బిగ్బాష్ లీగ్ అదరగొట్టిన ఈ బ్యాట్స్ మెన్స్ కు ఐపీఎల్ లో ఆర్ఆర్ తరపున ఆడే అవకాశం దక్కలేదు. 3 …
Read More » -
21 April
తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో కొత్త జోన్ల విధానం ఖరారు అయిన సంగతి విదితమే..దీంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, 2, 3 సహా ఇతర పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. ఇక ప్రభుత్వ శాఖలు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖరారు చేయగానే నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల కారణంగానే భర్తీకి నోచుకోలేదు. ఇప్పుడిక 4వేలకుపైగా పోస్టులు పడే ఛాన్సుంది. ప్రభుత్వం చెప్పిన 50వేల ఉద్యోగాలకూ కొత్త జోనల్ …
Read More » -
21 April
చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?
చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.
Read More » -
21 April
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More » -
21 April
దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »