తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »TimeLine Layout
March, 2021
-
15 March
తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,318కు పెరిగింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,654కు చేరింది. నిన్న కరోనా నుంచి 166 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,983 యాక్టివ్ కేసులున్నాయి.
Read More » -
15 March
బ్రావో సెంచరీ.. విండీస్ విక్టరీ..!
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో తొలుత శ్రీలంక 274/6 రన్స్ చేసింది. హసరంగ (80*) బండార (55*) రాణించారు. అనంతరం మెస్టిండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డారెన్ బ్రావో సెంచరీ చేయగా హోప్ (64), పొలా్డ్ (53*) రాణించారు.
Read More » -
15 March
జనంలోకి వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జిల్లాల వారీగా వైఎస్ అభిమానులు ఇతర నేతలతో భేటీ అయిన షర్మిల ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో మెదటి బహిరంగ సభ …
Read More » -
15 March
బాలయ్యపై రోజా సెటైర్లు
ఏపీలో ఆదివారం రోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో నగరి ఎమ్మెల్యే రోజా జోష్ లో ఉన్నారు.సీనియర్ నటుడు,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు వేశారు. బాలయ్య సినిమాలోని ‘తొక్కి పడేస్తా’ డైలాగ్ కు ‘వైసీపీ ఒకరికి ఎదురు వెళ్లినా.. ఒకరు వైసీపీకి ఎదురు వచ్చినా తొక్కి పడేస్తాం అంతే’ అని అన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు కాదు కదా …
Read More » -
15 March
టీమిండియా గ్రాండ్ విక్టరీ
ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …
Read More » -
15 March
రికార్డుల రారాజు విరాట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.
Read More » -
14 March
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు వీళ్ళే..!
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ క్యూలైన్‌లో బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని, అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఓల్డ్ మలక్‌పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని …
Read More » -
14 March
పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ క్లారిటీ..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటు వెండితెరపై సందడి చేస్తూనే అడపాదడపా బుల్లితెరపై పలు రియాలిటీ షోస్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్ …
Read More » -
14 March
అందరికి ఆదర్శంగా నిలిచిన నవ వధువు
మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉండగా.. తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఫిర్దోస్ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వధువు ఉదయం 8.30గంటలకు కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత …
Read More »