ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు …
Read More »2024లో ఖాతా కూడా తెరవని జనసేన -Latest సర్వే..?
దేశ వ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈ క్రమంలో ఇండియా టుడే ఏపీ గురించి కూడా ప్రస్తావించింది.ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ ఏపీలో ఏ మాత్రం పనిచేయదని పేర్కొంది. బీజేపీ, జనసేన కూటమి ఒక్క ఎంపీ సీటులోనూ విజయం సాధించదని తెలిపింది. పోటీ …
Read More »ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం
ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట
ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.
Read More »ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.
Read More »చిరు-జగన్ భేటీపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి,ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డిల భేటీపై టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున స్పందించాడు. ‘మా’ అందరి కోసమే చిరంజీవి జగన్తో సమావేశమయ్యారు. సినిమా విడుదల ఉండడం వల్ల నేను వెళ్లలేకపోయా. జగన్కు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి వెళ్తా అన్నారు.. నేను వెళ్లమని సలహా ఇచ్చా. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. టికెట్ రేట్లపై స్పందించింది నా సినిమా వరకు …
Read More »సీఎం జగన్ తో చిరంజీవి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గురువారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలవనున్నారు . వీరిద్దరి మధ్య ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వక లంచ్ భేటీ జరగనుంది. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read More »మంత్రి కొడాలి నానికి కరోనా
ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
Read More »సీఎం జగన్ కు RGV ఉచిత సలహా ..జగన్ పాటిస్తాడా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి నిత్యం ఏదోక వార్తతో వివాదాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను తప్పు దారి పట్టిస్తున్నారని వర్మ అన్నాడు. ఇకనైనా …
Read More »