తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ పాస్లు జారీ చేయనున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించి బస్పాస్ కోడ్ పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్ధులకే బస్ పాస్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బస్పాస్లను పొందే విద్యార్ధులు తమ విద్యా సంస్థ బస్పోస్ కోడ్ తో సహా నిర్దేశిత పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..
Read More »బస్ పాసు చార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Read More »విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..శభాస్ జగన్ అంటున్నయువత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని విద్యార్థులు ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో …
Read More »