దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్నది.
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »దేశంలో కరోనా వైరస్ విలయతాండవం
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740. ఇప్పటి వరకు కరోనాతో 1,75,649 మంది చనిపోగా, 1,26,71,220 …
Read More »