కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More »ఏపీలో 20,065 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కంగనా రనౌత్ కి కరోనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.
Read More »తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.
Read More »18ఏళ్ల పైబడినవారికి ఎప్పుడంటే టీకా.?
తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది. ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.
Read More »ఈ కరోనా లక్షణాలుంటే..?
కరోనా విషయంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలన్నారు. 1. ముఖం, పెదవులు, గోర్లు నీలి రంగులోకి మారడం 2. ఛాతిలో నొప్పి అనిపించడం 3. ఆయాసం, శ్వాస సమస్యలు 4. దగ్గు ఎక్కువ కావడం 5. అలసట ఎక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.
Read More »తెలంగాణలో ఈ నెల 15 వరకు కొవిడ్ టీకా మొదటి డోసు నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయంఈ నెల 15 వరకు కొవిడ్ టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉంది.రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారు.మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Read More »కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు.
కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు. 1. లక్షణాలు కనబడిన మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. 2. లక్షణాలు కనబడిన మొదటి రోజే ఒక డాక్టర్(online/offline) పర్యవేక్షణ లో ఉండండి. 3. లక్షణాలు కనబడిన రెండో రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు. RTPCR లో పాజిటివ్ రాగానే కంగారు పడుతూ హాస్పిటల్స్ కి పరిగెత్తకండి. RTPCR లో …
Read More »కరోనాతో ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) మృతి
టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురి సంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి పాటలను పాడారు. ‘పండంటి కాపురం’, ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.
Read More »