తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు, రేపు నిలిచిపోనుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిని 12-16 వారాలకు కేంద్రం మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను శని, ఆదివారాల్లో నిలిపివేసింది. ఈ నెల 17 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »తెలంగాణలో త్వరలోనే ప్రజలందరికీ టీకాలు
సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారు చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫార్మా సంస్థల ప్రతినిధులకు నిన్నటి సమావేశంలో చెప్పారు.
Read More »త్వరలో 2డీజీ డ్రగ్స్
DRDO భాగస్వామ్యంతో కరోనా బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డా. రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. వచ్చేవారమే 10వేల డోసుల మొదటి బ్యాచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్, DRDO అధికారులు తెలిపారు. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
Read More »రాశీ ఖన్నా సంచలన నిర్ణయం
కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.
Read More »దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా
దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అనే సింగిల్ డోసు టీకా కోసం డాక్టర్ రెడ్డీస్, కేంద్రంతో చర్చలు జరుపుతోంది. అన్ని అనుమతులు లభిస్తే జులై నాటికి స్పుత్నిక్ లైట్ టీకా దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి రష్యాలో ఇప్పటికే అత్యవసర అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ 79.4% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రష్యా తెలిపింది.
Read More »మంత్రి హారీష్ రావు ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీటీ స్కాన్ రేట్లు తగ్గాయి. రూ.2 వేలకే స్కాన్ చేసేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయి. సీటీ స్కాన్ కోసం రూ. 5,500 వసూలు చేయడంపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లను సగానికి తగ్గించాలన్నారు. అందుకు వారు ఓకే చెప్పారు.
Read More »రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది?
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటి డోసులో ఓ కరోనా వ్యాక్సిన్ తీసుకుని రెండో డోసులో పొరపాటున మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది?. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీనిపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడించింది. ఇలా వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో అలసట, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇతర సమస్యలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.
Read More »తెలంగాణలో మే 31 వరకూ ఫస్ట్ డోస్ లేదు
తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని DMHO డా. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. మే 31 వరకూ ఎవరికీ ఫస్ట్ డోస్ ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
Read More »సీఎం జగన్ అసంతృప్తి
కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు. టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల …
Read More »