ఏపీ ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత..దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రభాకర్.. ‘నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఓ షూటర్ నాకు ఫోన్ చేసి.. నన్ను చంపేందుకు పురమాయించారని చెప్పాడు. సొంతంగా గన్మెను పెట్టుకుని పోషించలేను. ఉచితంగా రక్షణ కల్పించండి’ అని కోరారు.
Read More »