Home / Tag Archives: cm jagan (page 17)

Tag Archives: cm jagan

సంచలనం..ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్..!

నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్వయంగా సీఎం జగన్ ప్రవేశపెట్టారు. తొలుత కేబినెట్‌లో సమావేశంలో శాసనమండలి రద్దు నిర్ణయంపై ఆమోద ముద్ర వేసిన అనంతరం…స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ కమిటీని సమావేశపరిచారు. అయితే ఈ బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరు కాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశం కాగానే సీఎం జగన్ శాసనమండలి రద్దు …

Read More »

లోకేష్‌‌కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సీఎం జగన్..!

ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్‌ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత …

Read More »

శాసనమండలిపై రద్దుపై సీఎం జగన్ సంచలన నిర్ణయం…!

ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …

Read More »

అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన నేత ఎవరు..ఎందుకో తెలుసా

గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అనంతపెరం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం …

Read More »

సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్…!

 అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ …

Read More »

మూడు రాజధానులపై జగన్ సర్కార్ సంచలన ప్రకటన.. అమరావతి రైతులకు చెప్పింది ఇదే..!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్‌ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …

Read More »

బాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు జిల్లాలలో పర్యటిస్తూ.. జోలెపట్టుకుని అడుక్కుంటూ సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు.. సీఎం జగన్‌పై పిచ్చి తుగ్లక్, ఉన్మాది, బలి ఇవ్వాలంటూ అసాధారణ భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సీఎం జగన్‌‌పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.   జనవరి 20న రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చర్చ …

Read More »

సీఎం జగన్‌తో భేటీ అయిన హైపవర్ కమిటీ.. అమరావతి రైతుల ఇష్యూ తేల్చేస్తారా..!

ఏపీలో పరిపాలనా, అధికార వికేంద్రీకరణ దిశగా ముందడుగు పడుతుందా…మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా.. రాజధాని రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు సర్కార్ చెక్ పడుతుందా..ఇవాళ సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ కానుండడంతో రాజధాని రగడకు ప్రభుత్వం త్వరలోనే పుల్‌స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  తాజాగా ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌తో సమావేశం అయింది. తాడేపల్లి …

Read More »

గుడివాడలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్..!

ఏపీ అంతటా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు భోగి మంటలతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 …

Read More »

రోడ్డు మీద డ్రామా చేస్తున్న బాబును అరెస్ట్ చేస్తే ‌జనసేనానికి కోపం వచ్చిందే..!

అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్‌ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat