Home / ANDHRAPRADESH / బాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

బాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు జిల్లాలలో పర్యటిస్తూ.. జోలెపట్టుకుని అడుక్కుంటూ సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు.. సీఎం జగన్‌పై పిచ్చి తుగ్లక్, ఉన్మాది, బలి ఇవ్వాలంటూ అసాధారణ భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సీఎం జగన్‌‌పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.

 

జనవరి 20న రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ…సీఎం జగన్‌పై బాబు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని నాని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీ ముష్టి ఏదో నువ్వు అడుక్కో కానీ.. సీఎం వైఎస్‌ జగన్‌‌ను కించపరిస్తే మాత్రం ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. చంద్రబాబు అడుక్కున్నా..పస్తులున్నా.. రాష్ట్ర అభివృద్ది కోసమే మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తుందని నాని స్పష్టం చేశారు. అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని తరలించడం లేదని నాని తేల్చి చెప్పారు.

 

అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, అదే సమయంలో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, , గతంలో ఉన్న ఒప్పందాల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు పిచ్చి కుక్కలా రోడ్డునపడి తిరుగుతున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని విమర్శించారు. గత ఐదేళ్లలో అమరావతిని కట్టలేని చంద్రబాబు.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఔట్‌ డేటేడ్‌ పొలిటీషియన్‌ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా సీఎం జగన్‌పై చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.