Home / Tag Archives: CM KCR (page 78)

Tag Archives: CM KCR

ఈ నెల 24న యాదాద్రికి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 24వ తేదీన యాదాద్రికి వెళ్లనున్నారు . యాదగిరిగుట్టలో జరిగే టీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు తుంగ బాలు వివాహానికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి గుట్టమీద జరిగే అభివృద్ధి పనులను స్తపతులు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. ఇక్కడి పనులను ఆయన …

Read More »

అమ్మలానే.. తెలుగునూ కాపాడుకుందాం..సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …

Read More »

మైనార్టీలకు దానితో లింకు లేకుండా నేరుగా సాయం.. సీఎం కేసీఆర్

ఇవాళ  ప్రగతి భవన్‌లో ముస్లీంలు, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి  కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం సాయం అందేలా పథకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. దీని కోసం మహారాష్ర్టాకు ఒక బృందం తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని …

Read More »

ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు.. సీఎం కేసీఆర్

ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. …

Read More »

విద్యుత్ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్  విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని …

Read More »

మంత్రి హరీష్ రావు స్కెచ్..ఆ గ్రామం మొత్తం టీఆర్‌ఎస్ వైపే..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి హరీష్ రావు …

Read More »

కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర సృష్టించనున్న హైదరాబాద్ మెట్రో ..!

దేశంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ.. హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నది. త్వరలో నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది. ఇప్పటివరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్‌తో కొచ్చి మెట్రో ఆరునెలల కిందట నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనున్నది. నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీలు, మియాపూర్-ఎస్సార్‌నగర్ మధ్య 10 కి.మీల …

Read More »

అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు …

Read More »

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్

శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …

Read More »

ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు..కేసీఆర్

ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat