తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …
Read More »ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి-మంత్రి హరీశ్‌రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే …
Read More »తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందని …
Read More »మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు …
Read More »ప్రగతి భవన్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరారు. ఎంపిక చేసిన 427 మందితో 16 బస్సులు హుజూరాబాద్ నుంచి పయణమయ్యాయి. ఈ బస్సులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ పాల్గొన్నారు. పథకం అమలు, …
Read More »ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 240 అధ్యాపక, వర్సిటీల్లో 25 వేల సహాయ ఆచార్యుల, 157 బ్యాక్ గ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బ్యాక్ గ్ ఖాళీల్లో 92 SC, 65 ST కేటగిరికి చెందినవి అని.. వీటికి జూలైలో నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే ఏడాది జనవరిలో డిగ్రీ అధ్యాపకుల నియామకాలకు, ఫిబ్రవరిలో సహాయ ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ …
Read More »