Home / Tag Archives: ex cm

Tag Archives: ex cm

50ఏళ్ళుగా ఓటమి ఎరుగని మాజీ సీఎం

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పూతుపల్లి నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తొలిసారి 1970లో తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు చాందీ తొలి విజయం సాధించారు. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఇది 12వ సారి. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 50 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Read More »

చంద్ర‌బాబుకు ఏపీ సీఐడీ షాక్

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉద‌యం వ‌చ్చారు. అమ‌రావ‌తి అసైన్డ్ భూ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసానికి సీఐడీ అధికారులు వ‌చ్చారు. భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌పై అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబుతో పాటు మాజీ మంత్రి నారాయ‌ణ‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద నోటీసులు …

Read More »

సొంత ఇలాఖాలో చంద్రబాబుకి షాక్

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పనితీరును మెచ్చే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ మద్దతుదారులే గెలిచారని, ఈ ఫలితాలు చంద్రబాబు, లోకేశ్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు గతంలో చంద్రగిరిని వదిలి కుప్పం చేరుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పక్క రాష్ట్రాలు, …

Read More »

గురువారం తిరుపతికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

Read More »

ఏపీలో టీడీపీకి షాక్

ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

Read More »

ఏపీలో మరో ఓటుకు నోటు తరహా-నామినేషన్ వేస్తే 2లక్షలు ఆఫర్..?

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్‌ అభ్యర్థులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్‌ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …

Read More »

బాబు అన్నంత పని చేసేశాడు

కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు

Read More »

గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి (94)కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృత్తి రిత్యా న్యాయవాది అయిన మాధవ్ సింగ్ 1976లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత అంటే 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 182స్థానాలకు గాను 149 …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుపై కేసు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన …

Read More »

వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్

ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు.. త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.

Read More »