తెలంగాణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గోదావరి, అంజిరెడ్డి రెడీ అవుతున్నారు. అంజిరెడ్డి దంపతులకు నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. దీంతో ఇవాళ సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అంజిరెడ్డి ఇంటికి వెళుతున్నారు.
Read More »జీహెచ్‌ఎంసీలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21 నామినేషన్ల పరిశీలన. …
Read More »హైదరాబాద్ మరింత సురక్షితంగా, భద్రంగా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మోగిన నగారా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ …
Read More »నేడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. ఈ సందర్భంగా ఆయన నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం …
Read More »సిద్ధాంతం లేని రాద్ధాంతపు పార్టీ బీజేపీ
బీజేపీకి ఒకప్పుడు సిద్దాంతం ఉండేది. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారింది. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. వారి వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి. కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు వేయాలి. 70 ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెరుకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదు. …
Read More »గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాక్
తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగరంలోని ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణగౌడ్ ఈ నెల 18 బీజేపీలో చేరనున్నారు. ఫతేనగర్‌లో జరిగే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్, సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్ది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Read More »హైదరాబాద్ పేరును మారుస్తాం -ఎంపీ అర్వింద్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. కేంద్రం నిధుల విషయంలో మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారు. రూ.224 కోట్లు ఇస్తే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే మంత్రి కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరు. GHMC ఎన్నికల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నసీఎం కేసీఆర్ పనిలో సోమరిపోతని విమర్శించారు.
Read More »గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితి రూ.5లక్షలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయవచ్చునని, ఈ పరిమితిని మించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. పాలక మండలి గడువు ముగిసే ఫిబ్రవరి 10వ తేదీ లోగానే ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. ఈసీ కార్యాలయంలో గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు నగరం పరిధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. వార్డులవారీగా ఓటరు …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తాం
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …
Read More »