ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …
Read More »మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్
జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read More »కేంద్ర మంత్రితో మంత్రి తలసాని భేటీ…ఎందుకంటే..?
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పరుషోత్తం రూపాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు, పథకాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మద్దతు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర …
Read More »