Home / SLIDER / అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి

అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు.

జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు.

ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో అందరి భాగస్వామ్యం అవసరమని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రధానంగా క్లీన్ అండ్ గ్రీన్‌లో భాగంగా వ్యాపార వాణిజ్య సంస్థలు తమ దుకాణాల ముందు మొక్కలు నాటడంతో పాటు డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంటువ్యాధులకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు.