లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. …
Read More »శ్రీవారి సేవలో Uppal MlA
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన …
Read More »లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీలో హైదరాబాద్ హవా
లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది. కొవిడ్ వ్యాప్తితో వైద్యారోగ్య …
Read More »హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ
అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్ హాల్స్, జిమ్, …
Read More »ఐటీ నియామకాల్లో హైదరాబాద్ కు రెండోస్థానం
ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు చెరో 18 శాతంతో …
Read More »మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం
ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్ షో …
Read More »హైదరాబాద్.. తయారీ హబ్
తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో హైదరాబాద్ మహానగరం దేశంలోనే ముందంజలో ఉందని జేఎల్‌ఎల్ నివేదిక వెల్లడించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు తర్వాత రెండో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ నిలిచింది. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా దేశంలోనే స్టార్టప్‌లకు హబ్‌గా హైదరాబాద్ ఎదిగింది. ఐటీ రంగంతోపాటు ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్, రక్షణ, ఈఎస్‌డీఎం, మెడికల్ డివైజెస్ రంగాలకు సంబంధించిన విభాగాల్లో మంచి పనితీరును …
Read More »పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి : మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగింస్తూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ …
Read More »పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి
పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …
Read More »తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్ చైర్మన్-1గా ఉన్న ఆయనను కౌన్సిల్ నూతన అఫిషియేటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్ పాపిరెడ్డి చైర్మన్ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు. 2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని …
Read More »