భారత సంతతి వ్యక్తి అయిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో బంగా నామినేషన్ ఒక్కటే మిగిలింది. దీంతో బంగా నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు.
Read More »అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మళ్లీ కరోనా
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించిన మూడు రోజుల్లోనే.. వ్యాధి మళ్లీ ఆయనకు తిరగబెట్టింది. దీంతో మరోమారు ఆయన ఏకాంతంలోకి వెళ్లారు. అయితే బైడెన్ కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ డాక్టర్ కెవిన్ తెలిపారు.
Read More »ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్‌లో ప్రసంగం చేయడానికి జెలెన్‌స్కీకి ఆహ్వానం వచ్చింది. జూమ్ ద్వారా జరిగే సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల జెలెన్‌స్కీతో టచ్‌లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న సభ్యులందరితో జెలెన్‌స్కీ మాట్లాడనున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అంబాసిడర్ ఒక్‌సానా మర్కరోవా …
Read More »అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన ప్రకటన
కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్‌ఐఎస్ నాయకులను హతమార్చాలని అమెరికన్ ఆర్మీని ఆదేశించారు. ‘కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని …
Read More »అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
Read More »