Home / Tag Archives: ktr (page 384)

Tag Archives: ktr

గ్రీన్ ఇండియాలో మహేష్ బాబు

తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. …

Read More »

తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్

మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్‌ చికిత్స పొందుతున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌ అయింది. ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్‌ కేర్‌ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్

తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు …

Read More »

మాస్కులు లేకపోతే జరిమానే

కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శనివారం పాలకుర్తికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి.. సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క రోనా నియంత్రణకు ఏ ఊరికి ఊరు ప్రజాప్రతినిధులు, …

Read More »

పేద విద్యార్థులకు తెలంగాణ జాగృతి అండ

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువును కొనసాగించేందుకు తెలంగాణ జాగృతి సాయం చేసింది. తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్‌ లెర్నింగ్‌ సర్కిళ్ల (వీఎల్‌సీ)కు.. మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను వితరణ చేశారు. ఈ సాయం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ …

Read More »

మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటీవ్

మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం …

Read More »

తెలంగాణలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య …

Read More »

సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు

కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో …

Read More »

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయ‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతి దుబ్బాక ప్ర‌జ‌ల‌కు, రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి తీర‌ని లోట‌ని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు.

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ శాసనసభ్యులు,అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.  దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat